. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం : విశాఖ సందేశం వార్తలు :వి ఎం ఆర్ డి ఎ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కి విశేష స్పందన లభించింది. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రజా దర్బార్ లో పాల్గొని, అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే ప్రజా దర్బార్ కి వచ్చే అర్జీల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కువ సార్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని సూచించారు. సోమవారం జరిగిన ప్రజా దర్బార్ కి మొత్తం 14 వినతులు రాగా వాటిలో ప్లానింగ్ -10, ఎస్టేట్ -2, ఇతర విభాగాల సంబంధించి 2 చొప్పున వినతులు వచ్చాయి. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ గారు, ప్రధాన ఇంజనీర్ శ్రీ వినయ్ కుమార్ గారు , ఎస్టేట్ అధికారి శ్రీ దయానిధి తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment