గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు చర్యలు ముమ్మరం చేయాలి. – కేకే రాజు, విశాఖ జిల్లా అధ్యక్షులు*
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు చేపట్టాలని కేకే రాజు కోరారు.
సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం గాలింపు చర్యలను విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు శాఖల సమన్వయంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లను వినియోగించి మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ధైర్యం చెప్పడంతో పాటు, గాలింపు చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరుతున్నాము.
ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
– కేకే రాజు
విశాఖ జిల్లా అధ్యక్షులు

Comments
Post a Comment