సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులకు వివేకానంద సంస్థ మరియు రౌండ్ టేబుల్ సంస్థ వారు టాటా గ్లూకోజ్, వాటర్ బాటిల్స్, ప్రసాదాలు పంపిణీ....
వివేకానంద సంస్థ మరియు రౌండ్ టేబుల్ సంస్థ మరియు సభ్యుల సహకారంతో, కైలాసగిరి సమీపంలో సింహాచలం గిరి ప్రదక్షణ భక్తులకు టాటా గ్లూకోజులు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు కొ ల్లపూడి .భరత్ , తండ్రి కొ ల్లపూడి .ప్రభాకర్ పేరుమీద విరాళాన్ని అందించారు. ప్రతి సంవత్సరం కూడా వివేకానంద సంస్థ వారు సింహాచల గిరి ప్రదక్షిణ భక్తులకు మజ్జిగ ,ప్రసాదాలు అందిస్తూ నారాయణ సేవలో పాల్గొంటున్నారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి పవిత్ర యాత్ర పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు పొందాలని, స్వామివారి ఆశీస్సులతో ఈ నారాయణ సేవలో పాల్గొంటున్నందుకు సంస్థవారు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని
ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సంస్థ మాజీ చైర్మన్ మక్సుద్ గారికి, రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు భరత్ గారికి సంస్థ అధ్యక్షులు అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులుP. నల్ల రాజు,ch. ఎల్లాజీ, గజపతి స్వామి, గురు స్వామి, గురుమూర్తి, వాసుపల్లి. కోదండ రావు, పద్మావతి దంపతులు పాల్గొని వారి సేవలను అందించారు.



Comments
Post a Comment