. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం ;విశాఖ సందేశం వర్తవాహని:ఉద్యోగుల ఇరవై రెండేళ్ల కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖపట్నం స్వర్ణ భారతి స్టేడియంలో ఆదివారం ఉత్తరాంధ్ర సిపిఎస్ ఉద్యోగులు,ఉపాధ్యాయులు నిర్వహించిన కృతజ్ఞతాభివందన సభకు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై అతిధులుగా హాజరైన ఎమ్మెల్యేలు విష్షు కుమార్ రాజు , వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు,ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్,పి రాజ శేఖరం, కంచర్ల శ్రీకాంత్ వేలాదిగా హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు.ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సిపిఎస్ నుండి ఓపిఎస్ కు మారుస్తూ జీవో నెంబర్ 53ను జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలిపారు.అపారమైన అనుభవమున్న చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.చంద్రబాబు ఉద్యోగుల పక్షపాతి అని తెలిపారు. సమాజంలో
ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్యాశాఖామంత్రి నారా లోకేష్ లు అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు.ఉద్యోగులు,ఉపాధ్యాయులు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. స్వర్ణాంధ్ర లక్ష్యంతో అహర్నిశలు కృషిచేస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబుకు,కూటమికి 2029 ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సిపిఎస్ నుండి ఓపిఎస్ కు మారుస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 53 వల్ల వేలాది ఉద్యోగులు లబ్దిపొందుతారని తెలిపారు.ఉపాధ్యాయులంటే తనకు ఎంతోగౌరవమన్నారు.గత ప్రభుత్వం మద్యం దుకాణాల దగ్గర క్యూలైన్లలో టీచర్లను నియమించి అగౌరవపరచిందన్నారు. 2014 నుండి 2019 వరకు రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగిందన్నారు.కూటమిని గెలిపించిన ప్రభుత్వ ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు విష్ణుకుమార్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు మాట్లాడుతూ ఓపిఎస్ విధానాన్ని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుందని,వారి కుటుంబాలకు రిటైర్మెంట్ ఉండదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి సుమారు 11వేల మంది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన కూటమి ప్రభుత్వానికి జీవితాంతం ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు.2019- 24 ఐదేళ్ల కాలం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్రంలో చీకటి యుగమన్నారు.గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు,మెడికల్ బిల్లులు మర్చిపోయారన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా ఉపాధ్యాయుల జీతాలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. వైఎస్ సర్కారు 2004 సెప్టెంబరులో సీపీఎస్‌ను అమలులోకి తీసుకొచ్చిందని,సీపీఎస్ అమలులోకి రాకముందే అప్పటి చంద్రబాబు సర్కారు హయాంలో డీఎస్సీ సహా పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయని గుర్తు చేసారు. ఉద్యోగార్థులు పరీక్షలు రాశారని, నియామకాలు జరిగేసరికి సీపీఎస్ అమలులోకి రావడంతో సీపీఎస్‌కే పరిమితమయ్యారన్నారు.ఇలాంటి ఉద్యోగులు 10,715 మంది ఉన్నారని,అందులో సుమారు 6500 మంది ఉపాధ్యాయులేనన్నారు. రెండు దశాబ్దాల తర్వాత చంద్రబాబు సమస్యను పరిష్కరించి వేలాది ఉద్యోగులకు,వారి కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించారన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమని 2029 లో తిరిగి కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ఉద్యోగులు అండగా నిలవాలని చిరంజీవిరావు కోరారు.ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లతోనే కూటమి ప్రభుత్వం కొలువుతీరిందని,ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అధిక మెజారిటీకి ప్రభుత్వ ఉద్యోగులే కారణమని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.థాంక్యు యు సీఎం సార్,జయహో చంద్రబాబు,ఓపీఎస్ పక్షపాతి చంద్రబాబు,చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, సముద్రమంత ఆనందం, కూటమితోనే మేమందరం అనే నినాదాలతో ప్రభుత్వ ఉద్యోగులు సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. అనంతరం అతిధులను ఉద్యోగ సంఘాల నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు మేడిశెట్టి శ్రీనివాస్, ఆర్ అప్పారావు, కేఎల్ ప్రసాద్, బలగ శ్రీనివాస్, సుబ్బారెడ్డి,వేలాదిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు,ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments
Post a Comment