Skip to main content

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ , దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్రమంతా అనేక ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ వస్తున్నది.

.                     K.V.SHARMA EDITOR 
అందులో భాగంగా 02-08-2026 ఆదివారం నాడు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలు  ఇసుక కొండ శ్రీరమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 8  గంటలకు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే ఉచిత రీతిన సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములను నిర్వహించనున్నామన్నారు . స్థలాభావం వల్ల 125 జంటలను మాత్రమే ప్రవేశం కల్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు . 

పాల్గొనదలచిన వారు ఆగస్టు 1 వ తేదీ లోపుగా నేరుగా ఆలయ సిబ్బందిని సంప్రదించి మీ పేరు గోత్ర నామాలను  నమోదు చేసుకోని టోకెన్లు తీసుకోవాలని సూచించారు  . 

ఆగస్టు 2వ తేదీ ఆదివారం  ఉదయం 8 గంటలకే భక్తులు ఆలయమునకు విచ్చేయాలనీ  8:30 నిమిషాలకు వ్రతము ప్రారంభించబడతాయన్నారు.

ఈ వ్రతములో పాల్గొనదలచిన భక్తులు 2 కొబ్బరికాయలు, 6 అరటి పండ్లు ,విడి పువ్వులు మాత్రమే తీసుకునిరావాలనీ, మిగతా పూజా సామాగ్రి అంతా ఉచితంగా ఇవ్వబడుతుందని తెలియ జేసారు.

ఈ సందర్భంగా , ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలకు సంబంధించిన గోడపత్రికను దేవాదాయ శాఖ  HDPT ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ జి ఆర్ కే ప్రసాద్  (రాంబాబు) , ఆలయ ఈవో శ్రీ టి రాజగోపాల రెడ్డి, ధర్మ కర్తల మండలి చైర్మన్ శ్రీ కే. సూర్యప్రసాద్, HDPT సభ్యులు శ్రీ  M.V.రాజశేఖర్  శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కరించారు .

ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ జి ఆర్ కే ప్రసాద్ (రాంబాబు)మాట్లాడుతూ ఆరోజు  హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ శ్రీ దాసరి శ్రీనివాసులు IAS(R) పాల్గొంటారని తెలిపారు .

 ఆలయ అర్చకులు పి నరసింహ ఆచార్యులు శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో వ్రతాలను నిర్వహిస్తారని కనుక భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, సాంప్రదాయ దుస్తుల్లోనే వచ్చి సామూహిక వ్రతాల్లో పాల్గొని కోరికలు తీర్చే శ్రీ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని  కోరారు .


                    టి రాజ గోపాల్ రెడ్డి 

                   కార్య నిర్వహణాధికారి

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...