Skip to main content

శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం.

 

                   K.V.SHARMA EDITOR 
18 జూలై 2026శ్రీ స్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో  నేడు సింహగిరిపై స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా మూడవ శనివారం రాజగోపురం ఎదురుగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు వారి ఆధ్వర్యంలో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని  నిర్వహించారు. 

తదనంతరం ఉద్యోగులందరితోస్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారుస్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలకొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ... ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చెయ్యటం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ప్రమాణం చేస్తు ఆలయ ఉద్యోగులు శానిటరీ విభాగం ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారులు పర్యవేక్షణ అధికారులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

Comments