Skip to main content

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను శాసన మండలిలో ప్రస్తావిస్తాను: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్

.            SRINIVAS  SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం...డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలోని ఎమ్మెల్సీ  క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ, అమరావతి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు  బొమ్మి ఇజ్రాయిల్ ను మర్యాదపూర్వకంగా  కలిసి ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన తర్వాత సుమారు 16 వేల ఖాళీ పోస్టులు ఇప్పటికీ భర్తీ చేయలేదని, దీంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడిందని తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు అదనంగా ప్రయాణిస్తున్నప్పటికీ, దానికి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చలేదని పేర్కొన్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

 వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల దృష్ట్యా కనీస అవసరాల కోసం 4,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వల్ల ఆర్టీసీకి కలుగుతున్న ఆర్థిక భారాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో 12వ వేతన సంఘం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, మూడు సంవత్సరాలు దాటినా కమిటీ ఏర్పాటు చేయకపోవడం, మధ్యంతర ఉపశమనం (IR) ప్రకటించకపోవడం, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలను నిలిపివేయాలని, మూసివేసిన ఆర్టీసీ డిపోలను తిరిగి ప్రారంభించాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు, పీఎఫ్ తదితర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ  బొమ్మి ఇజ్రాయిల్  స్పందిస్తూ, ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలు ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించినవని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులు మరియు ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేలా శాసన మండలిలో బలంగా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో

ఆర్టీసి జేఏసి నాయకులు ఎం.ఆర్ కృష్ణ,పందిరి రాంబాబు జె.సింహాద్రి,ఎస్ ఎస్ నారాయణ,జంగా నాగేశ్వరరావు ,శ్రీనివాస్ తధితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...