Skip to main content

కూర్మావతారం లో దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథుడు !

.                K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు: టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథ యాత్ర దశావతార మహోత్సవాల సందర్భంగా శనివారం నాడు శ్రీ జగన్నాథ స్వామివారు "కూర్మావతారం"లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వైఖానస ఆగమ సంప్రదాయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


మధ్యాహ్నాం రథయాత్ర మహోత్సవాలలో పాల్గొన్న భక్తులకు 1000 మందికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. సాయంత్రం గీతా పారాయణం, చిన్నారులతో ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. శనివారం కావడంతో టర్నర్ సత్రం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది

Comments