Skip to main content

వంగవీటి మోహనరంగా ఆశయాలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.... అల్లవరం సెంటర్లో రంగా జయంతి.....

.             SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం....బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా  జయంతి పురస్కరించుకుని అల్లవరం సెంటర్లో  రంగా అభిమానులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం చిరస్మరణీయం. ఆయన ఆశయాలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అల్లవరం మండల జనసేన పార్టీ నాయకులు కంకిపాటి. వీరబాబు, అడపా. రాజారావు, అల్లవరం సొసైటీ అధ్యక్షులు కంకిపాటి.గోపి, సుంకర సాయి, బండి గుప్తాపు, చిట్టి వెంకన్న, దాసం శేషగిరి, కంకిపాటి.సుబ్బారావు, నున్న సూర్రావు, బండిగుప్తాపు.సూరిబాల, కాకిలేటి సాయి, మెరికిల.నాగేశ్వరరావు,బండి గుప్తాపు.బుల్లివెంకన్న  తదితరులు  పాల్గొన్నారు

Comments