వైఎస్సార్ జయంతి వేడుకలు: పేదలకు దుప్పట్ల పంపిణీ చేసిన వైఎస్సార్ విగ్రహానికి వైసిపి రాష్ట్ర ఎస్ఈసీ మెంబర్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ సి.ఎమ్.ఎ. జహీర్ అహ్మద్.
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం జులై 08 :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 39వ వార్డు లక్ష్మీ టాకీస్ సమీపంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైసిపి రాష్ట్ర ఎస్ఈసీ మెంబర్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ సి.ఎమ్.ఎ. జహీర్ అహ్మద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు రౌండ్ టేబుల్ సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ మక్సుద్ అహ్మద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా స్థానిక పేదలకు, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను చేరువ చేసిన మహోన్నత పథకం 'ఆరోగ్యశ్రీ'ని ప్రవేశపెట్టిన అరుదైన ప్రజా నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించి,
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన బాటలు వేశారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అలాంటి మహానేతను కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ కార్యక్రమంలో వైసిపి నాయకులు టి. కృష్ణ, సలీం, ఎమ్. అప్పన్న తదితరులు పాల్గొన్నారు




Comments
Post a Comment