Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సిబ్బందికి దిశానిర్దేశం

.                  K.V.SHARMA EDITOR 
సింహాచలం: తేదీ: 22 జూలై 2026ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు సూచించారు.


బుధవారం సింహాచలం పరిపాలన భవనంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధులత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, సహాయ కార్య నిర్వహణ అధికారులు, పర్యవేక్షణ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ సందర్భంగా సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు, విధులు నిర్వర్తించాల్సిన ప్రాంతాలపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద నాదస్వర వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం గౌరవ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి స్వామివారి రథాన్ని ప్రారంభించనున్నారు.


గిరి ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్‌లలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది నిర్వర్తించాల్సిన బాధ్యతలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలను అధికారులు సమావేశంలో వివరించారు.

గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ దృష్ట్యా ఈ నెల 28, 29 తేదీల్లో స్వామివారి అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించాలని కోరారు.

Comments