Skip to main content

ప్రవేటు పాఠశాలలను పరిశీలించిన పి.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పవన్ నాయుడు ఉద్దేశపూర్వకంగానే శ్రీ వాగ్దేవి స్కూలుపై ఆరోపణలు....

.           SRINIVAS SPL Correspondant 
అమలాపురం.:విశాఖ సందేసం :డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురంలో ఉన్నా పలు ప్రవేటు పాఠశాలలను పి.ఎస్.యూ (ప్రగతిశీల విద్యార్థి సంఘం) రాష్ట్ర సహాయ కార్యదర్శి పవన్ నాయుడు శనివారం   పరిశీలించారు. 


సామాజిక మధ్యమాలలో శ్రీ వాగ్దేవి పాఠశాలపై వస్తున్నా ఆరోపణలు, జిల్లా జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో ఇచ్ ఇచ్చిన పిర్యాదులపై పి.ఎస్.యూ (ప్రగతిశీల విద్యార్థి సంఘం) నాయకులు అమలాపురం వడ్డిగూడెంలో ఉన్నా శ్రీ వాగ్దేవి పాఠశాలను పరిశీలించారు.


 పాఠశాలలోని విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి మౌళిక వసతులు, పలు సౌకర్యాల గురించి విద్యార్థులను పవన్ నాయుడు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో పవన్ నాయుడు మాట్లాడుతూ 


శ్రీ వాగ్దేవి పాఠశాలను పరిశీలించడం జరిగిందని, పాఠశాలలో అన్ని సౌకర్యాలు మౌలిక వసతులు సక్రమంగానే ఉన్నాయని, విశాలామైన క్రీడా ప్రాంగణంతో కూడిన వాతావరణం కనపడిందన్నారు. 


ఈ మధ్యకాలంలో కొన్ని యూనియన్లు స్వలాభం కోసం పలు విద్య సంస్థలను ఎంచుకుని వాటిపై తప్పుడు పిర్యాదులు చేస్తున్నారని అలాంటి వారిపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి పోలీసులకు పిర్యాదు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కె భాను ప్రకాష్, ఏ. సిద్దు, జె. గణేష్, పి. చందు తదితరులు పాల్గొన్నారు.

Comments