ఎఫ్‌డిపిలు నిర్వహణపై దృష్టి సారించండి - ఏయూ ఫార్మశీ కళాశాలతో కలసి పనిచేయండి - అత్యుత్తమ పబ్లికేషన్ కలిగి ఉండాలి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్
. K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 10:ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుబంధ ఫార్మశీ కళాశాలలు ఆచార్యులకు ఉపయుక్తంగా నిలచే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఎఫ్.డి.పి)లను నిర్వహించడంపై దృష్టి సారించాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సూచించారు. శుక్రవారం ఆయన ఏయూ ఫార్మశీ కళాశాల ఆధ్వర్యంలో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ పిసిఐ సిలబస్ అంశంపై నిర్వహిస్తున్న ఒకరోజు మేధోమధన చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ విద్య విధానం-2020 అనుసరించి బి.ఫార్మశీ విద్యార్థలకు తయారు చేసిన సిలబస్‌మై చర్చించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ అనుబంధ కళాశాలలు ఏయూ ఫార్మశీ కళాశాలతో కలసి పనిచేయాలన్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రయోగశాలను ఉపయుక్తంగా నిలుపుకుంటూ అత్యుత్తమ పరిశోధనలు, ప్రచురణలు జరపాలన్నారు. ర్యాటిఫికేషన్ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అదే విధంగా ఏయూలో ఉన్న నైపుణ్య శిక్షణ కేంద్రాలను సందర్శించాలని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఆచార్యులను ఆహ్వానించారు.
రిఫ్రెషర్ కోర్సు పోస్టర్ ఆవిష్కరణ...కార్యక్రమంలో భాగంగా జూలై 18 నుంచి 31వ తేదీ వరకు నూతన పిసిఐ సిలబస్‌పై నిర్వహించనున్న రిఫ్రెషర్ కోర్సు పోస్టర్‌ను వీసీ ఆవిష్కరించారు. యూజీసీ మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో విభాగ ఫ్యాకల్టీ చైర్‌పర్సన్ ఆచార్య వి.గిరిజ శాస్త్రి, బిఓఎస్ చైర్మన్ ఆచార్య కె.ఈశ్వర్ కుమార్ తదితరులు ప్రసంగించారు.
పూర్వవిద్యార్థులతో అనుసంధానం కావాలి……ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్హశీ కళాశాలలో ఎం.ఫార్మశీ విద్యార్థుల తరగతులను వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతులు జరగుతున్న విధానం, ఉపాధి అవకాశాలు పొందుతున్న అంశం తదితర వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు వివిధ ఫార్మసంస్థలతో ఉపాధి అవకాశాలను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి, ఉద్యోగ అవకాశాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతీ విద్యార్థి ఉపాధి సాధించడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం దీనిలో ఎంతో ప్రధానమన్నారు. కేవలం పరీక్షల కోసం, మార్కుల కోసం చదడం సరికాదని, శాస్త్ర అంశాలపై అవగాహన పెంచుకోవడం, ప్రాధమిక అంశాలపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు. స్నేహితులతో కలసి శాస్త్ర సంశాలపై చర్చించడం, వివరిండచం వంటి చేయడం వలన మెరుగైన అవగాహన ఏర్పడుతుందన్నారు.

ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.గిరిజా శంకర్ మాట్లాడుతూ ఫార్మశి కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిద్దం చేసిన నియమావళి, సిలబస్‌పై చర్చించి, తగిన సూచనలు, సలహాలు అందించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు.
రిఫ్రెషర్ కోర్సు పోస్టర్ ఆవిష్కరణ...కార్యక్రమంలో భాగంగా జూలై 18 నుంచి 31వ తేదీ వరకు నూతన పిసిఐ సిలబస్‌పై నిర్వహించనున్న రిఫ్రెషర్ కోర్సు పోస్టర్‌ను వీసీ ఆవిష్కరించారు. యూజీసీ మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో విభాగ ఫ్యాకల్టీ చైర్‌పర్సన్ ఆచార్య వి.గిరిజ శాస్త్రి, బిఓఎస్ చైర్మన్ ఆచార్య కె.ఈశ్వర్ కుమార్ తదితరులు ప్రసంగించారు.
పూర్వవిద్యార్థులతో అనుసంధానం కావాలి……ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్హశీ కళాశాలలో ఎం.ఫార్మశీ విద్యార్థుల తరగతులను వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతులు జరగుతున్న విధానం, ఉపాధి అవకాశాలు పొందుతున్న అంశం తదితర వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు వివిధ ఫార్మసంస్థలతో ఉపాధి అవకాశాలను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి, ఉద్యోగ అవకాశాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతీ విద్యార్థి ఉపాధి సాధించడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం దీనిలో ఎంతో ప్రధానమన్నారు. కేవలం పరీక్షల కోసం, మార్కుల కోసం చదడం సరికాదని, శాస్త్ర అంశాలపై అవగాహన పెంచుకోవడం, ప్రాధమిక అంశాలపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు. స్నేహితులతో కలసి శాస్త్ర సంశాలపై చర్చించడం, వివరిండచం వంటి చేయడం వలన మెరుగైన అవగాహన ఏర్పడుతుందన్నారు.
పూర్వవిద్యార్థులు విభిన్న సంస్థలలో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని, వీరు విభాగానికి విలువైన సంపదగా నిలుస్తారన్నారు. వీరితో అనుసంధానం కావాలని, వీరు అవసరమైన మార్గదర్శకం అందించడం జరుగుతుందన్నారు. హాస్టల్ వసతి, భోజనం నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వీసీ వెంట ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment