Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంపై ఈఓ జె. వెంకట్రావు సమీక్ష.

.                  K.V.SHARMA EDITOR 
 సింహాచలం, 19 జూలై 2026:ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి  ‘గిరి ప్రదక్షణ’  పురస్కరించుకుని, స్వామివారి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేసే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించేలా వివిధ సేవా సంఘాలతో ఆదివారం సాయంకాలం  సింహాచలం దేవస్థానం పరిపాలనా భవనంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

​దేవస్థానం కార్యనిర్వహణాధికారి  జల్లేపల్లి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు ,ఏఈఓ రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు మరియు గోపాలపట్నం ట్రాఫిక్ సిఐ సురేష్ లా అండ్ ఆర్డర్ ఎస్సై రామారావు మారయ్య పాల్గొని సేవా సంఘాల ప్రతినిధులతో చర్చించారు.


భక్తుల సౌకర్యార్థం, అల్పహారాలు ,చక్రపొంగలి, పులిహోర వంటి ప్రసాదాలతో పాటు బిస్కెట్లు, గ్లూకోజ్, పాలు, నిమ్మరసం, మజ్జిగ మరియు పండ్లను వితరణ చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి.


సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు గోపాలపట్నం పోలీస్ వారితో సంప్రదింపులు జరపాలని  ఈఓ తెలియజేశారు.

ఆంధ్ర లేఖ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ శ్రీ గోపాల బాబా చారిటబుల్ ట్రస్ట్, శ్రీ హనుమాన్ సేవా సంఘంతో పాటు సుమారు 20కి పైగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


గిరి ప్రదక్షిణ రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, క్రమశిక్షణతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.

Comments