న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.... ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ( ఐ ఎల్ ఏ ) డిమాండ్.
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కోరుతూ గురువారం అమలాపురం బార్ అసోసియేషన్ ప్రాంగణంలో న్యాయవాదులు నినదించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేయాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాశి శేషారావు మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేలు చొప్పున స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు దాకారపు చిరంజీవి మాట్లాడుతూ అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. అనంతరం న్యాయవాదులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
న్యాయవాదులు డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని కలెక్టర్ మహేష్ కుమార్ న్యాయవాదులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సురేష్ కుమార్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నల్ల ప్రభాకర్ రావు, ఐ ఎల్ ఏ జిల్లా నాయకులు పియల సత్యనారాయణ, పినిపే వెంకట సత్యనారాయణ, కుంచే శ్రీనివాసరావు, సోమరాజు, భాస్కర్ జోసెఫ్, గుర్రాల రాంబాబు, రోహిణి, డి రాణి తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment