విశాఖపట్నం : విశాఖ పోర్టు కార్గో హ్యాండలింగ్ డివిజన్, ట్రాఫిక్ విభాగంలో సుదీర్ఘ కాలంగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి సోంబాబు పదవీ విరమణ పొందారు. సుమారు మూడు దశాబ్దాలకు పైగా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేసిన సోంబాబు నిజాయితీ, క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధతతో సహచరుల అభిమానం పొందారు. ఉద్యోగ జీవితమంతా సంస్థ అభివృద్ధికి, కార్మిక సంక్షేమానికి తనవంతు కృషి చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో అధికారులు, సహోద్యోగులు సోంబాబు సేవలను కొనియాడుతూ, ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో, ఆనందమయమైన కుటుంబ జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోంబాబు మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహోద్యోగులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన స్మరించుకున్నారు.

Comments
Post a Comment