Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం


 సింహాచలం, జూలై 21: విశాఖపట్నం ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ శ్రీనివాస్ దండ, ఐఆర్ఎస్, ఆదాయపు పన్ను శాఖ (ఇన్వెస్టిగేషన్) డైరెక్టర్ జనరల్ రాజర్షి ద్వివేది, ఐఆర్ఎస్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన ఉన్నతాధికారులకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ముందుగా శ్రీ స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.


ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు స్వామివారి ప్రసాదాలను అందజేసి, జ్ఞాపికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ఉన్నతాధికారులకు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్లు శ్రీ వెంకన్న తేజావత్, శ్రీ మనీష్ కుమార్, శ్రీమతి ఓ.ఎన్. సుప్రియారావు, శ్రీ గురుప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments