Skip to main content

ఏయూసిఈ ప్రిన్సిపాల్‌గా వెంక‌ట సుబ్బ‌య్య‌


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 31:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రిన్సిపాల్ గా మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ విభాగ‌ ఆచార్యులు కె.వెంక‌ట సుబ్బ‌య్య నియ‌మితుల‌య్యారు. శుక్ర‌వారం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ నుంచి నియామ‌క ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న స్వీక‌రించారు. కార్య‌క్ర‌మంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య వెంక‌ట సుబ్బ‌య్య‌ను విశ్వ‌విద్యాల‌య ఆచార్యులు అభినందించారు. అనంత‌రం సాయంత్రం ఆచార్య ఎం.శ‌శి నుంచి ప్రిన్సిపాల్‌గా ఆచార్య వెంక‌ట సుబ్బ‌య్య ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆచార్య ఎం.శ‌శి శుక్ర‌వారం ఉద్యోగ విర‌మ‌ణ చేసారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...