. K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 18:ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఎంవీఆర్ డిగ్రీ కళాశాల సహకారంతో రూసా 2.0 లో భాగంగా ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (FDP) పోస్టర్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ నేడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ జెనరేటివ్ ఏఐ, ఇంటరాక్టివ్ ఇ-కంటెంట్ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్" అనే అంశంపై మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని గాజువాక ఎంవీఆర్ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ కార్యక్రమంలో అధ్యాపకులకు కృత్రిమ మేధస్సు వినియోగం, డిజిటల్ బోధనా విధానాలు, ఆధునిక విద్యా సాంకేతికతలపై నిపుణులు శిక్షణ అందించనున్నారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంవీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. బాలకృష్ణ, కరెస్పాండంట్ డా వి. రామారావు, ప్రిన్సిపాల్ ఇంచార్జి డా వి. తేజేశ్వర రావు, కార్యక్రమ కన్వీనర్ వై. ఈశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment