Skip to main content

వంగవీటికి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్....

.            SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం....స్వర్గీయ వంగవీటి మోహనరంగా  79వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు  బొమ్మి ఇజ్రాయిల్  అల్లవరం మండలం గోడి గ్రామంలో  ఎమ్మెల్సీ   క్యాంప్ కార్యాలయం నందు రంగా  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ  మాట్లాడుతూ, వంగవీ

టి మోహనరంగా  బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

నేటి యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ, ప్రజల కోసం సేవ చేసే తత్వాన్ని అలవర్చుకోవాలని, రంగా  సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బొమ్మి ఇజ్రాయిల్  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చేట్ల సత్యనారాయణ, బి ముఖేష్, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments