Skip to main content

కొమరగిరిపట్నం గ్రామ దేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మెట్ల రమణబాబు.....

.              SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం.... అల్లవరం మండలం  కొమరగిరిపట్నం గ్రామం శ్రీ  కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని  రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మెట్ల రామ్మూర్తి సహకార సంఘం సొసైటీ చైర్మన్ మెట్ల రమణబాబు దర్శనం చేసుకున్నారు.  మహాలక్ష్మి అమ్మవారి  మూడు రోజులు జరుగు తీర్థంలో పలు రాష్ట్రాల నుంచి గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అమ్మవారి దర్శించుకున్న అనంతరం  మెట్ల రమణబాబుకి ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా  సత్కరించారు. ఈ సందర్భంగా రమణ బాబు మాట్లాడుతూ ఆలయం నిర్మాణం పూర్తి అయ్యేలా  చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. మూడు రోజులు జరిగే తీర్థంలో ఎటువంటి అవాంఛనియా  సంఘటనలు జరగకుండా పెద్దలతో చర్చించారు. రమణబాబు  వెంట సుబ్బాలమ్మ దేవస్థానం చైర్మన్ పెద్దిరెడ్డి నాయుడు,


 అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, వెండి బంగారం యూనియన్ మాజీ అధ్యక్షులు చింతలపూడి సత్తిబాబు, మెట్ల రామ్మూర్తి సొసైటీ సీఈవో కొమ్మూరి సత్తిబాబు, అల్లవరం మండల మాజీ వైస్ ఎంపీపీ గుర్రం నరసింహమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ గుర్రం బాబ్జి, సొసైటీ మాజీ అధ్యక్షులు గునిశెట్టి రోహిణి కుమార్, మాజీ గ్రామ ఉప సర్పంచ్ గుర్రం శ్రీను, గుర్రం దొరబాబు, ఆకుల రాము, సంగీతం తాతాజీ, మెట్ల బాబి, కుంపట్ల ఏడుకొండలు, నీలయ్య, ఆకుల రాము, బాబి అధిక సంఖ్యలో కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు.

Comments