Skip to main content

దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వ ముందుంటుంది: ఎంపీ గంటి హరీష్ మాధుర్ దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటర్స్ పంపిణీ.... లైసెన్సుల కోసం నేరుగా సంప్రదించండి: డిటిఒ శ్రీనివాస్......

.            SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందించిందని అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాలో 70 త్రి చక్ర వాహనాలను  పంపిణీ చేసిందని పార్లమెంట్ సభ్యులు  హరీష్ మాధుర్ తెలిపారు.


ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర అర్హతలను పరిశీలించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.

కార్యక్రమంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.

  ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గుడిపూడి నారాయణస్వామి


మాట్లాడుతూ దివ్యాంగుల స్వయం సమర్థత, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున సుమారు 1,800 మోటరైజ్డ్ ద్విచక్ర స్కూటీలను పంపిణీ చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు 10 చొప్పున మొత్తం 70 మంది దివ్యాంగులకు ఒక్కోటి సుమారు రూ.1.20 లక్షల విలువైన మోటరైజ్డ్ స్కూటీలను ఉచితంగా అందజేశామన్నారు. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో స్వయం సమర్థులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపుకు ప్రాధాన్యం ఇవ్వడం, స్వయం ఉపాధి కోసం రుణాల కల్పన, రాష్ట్రవ్యాప్తంగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యులు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్, రామచంద్రపురం మార్కెటింగ్ యార్డ్  చైర్మన్ కలిసి విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ స్కూటీలు దివ్యాంగుల చలనశీలతను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. 


జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతివారికి లైసెన్స్ తప్పనిసరి లైసెన్స్ కొరకు ఎలా అప్లై చేసినప్పుడు తమను దివ్యాంగులు సంప్రదించి సులభతరం చేసుకోవాలన్నారు. ఎస్. కె ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకరాలు  ఎస్. కె సూర్యకళ మాట్లాడుతూ  వృద్ధులు, వికలాంగులు  సుమారు 50 మందితో అద్దె భవనంలో  హోమ్ నిర్వహిస్తున్నానని స్థలం కేటాయించాలని ఎంపీ హరీష్ ను  కోరగా అధికారులు చర్చించి నిర్ణయం తెలియజేస్తానని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన వికలాంగులకు భోజనాలను  ఎస్. కె ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు అందజేశారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...