కాంగ్రెస్ పార్టీ కార్యాలయంఆంధ్రరత్న భవన్‌పై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం* *ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ దాడికి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి* *ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి డిమాండ్*
25.07.202026అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్‌పై బీజేపీ గుండాలు మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దారుణమైన, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఆమె తీవ్రంగా ఖండించారు. భారతదేశానికి స్వాతంత్ర్య సమర స్ఫూర్తిని అందించిన, 135 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం రాజ్యాంగ విలువలపై జరిగిన దాడి అని పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ పరీక్ష అక్రమాలపై, అలాగే ప్రజాధన వినియోగంపై లేవనెత్తిన ప్రశ్నలను తట్టుకోలేక బీజేపీ నాయకత్వం రాజకీయ కక్షతో ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ తీవ్రంగా గాయపడి కుడికాలుకు ఫ్రాక్చర్ కావడం, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు కావడం అత్యంత బాధాకరమని అన్నారు. శాంతియుతంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతిపక్షంపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రమాదకర ధోరణి అని విమర్శించారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని కోరారు.
రాజకీయ విభేదాలకు హింస ఎప్పటికీ పరిష్కారం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.
ఈ మీడియా సమావేశంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి కిషన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


Comments
Post a Comment