K.V.SHARMA EDITOR
శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న ఆంధ్ర యూనివర్సిటీని 1976-1978 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ రీ యూనియన్ ఫ్రెండ్స్ పేరుతో ఈరోజు 11.07.2026 శనివారం ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్వ విద్యార్థులైన పి రమేష్ కుమార్ ఐఏఎస్ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వారు, ఎమ్ ర్ విజయ్ కుమార్ ఐపిఎస్ మాజీ డీజీపీ గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ వారు, శ్యాంబాబు ఐఏఎస్, మాజీ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు, ఆశయ్య మాజీ ఐఏఎస్, కామేశ్వరరావు మాజీ ఆర్డిఓ, సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖర్, మాజీ ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు విజయ్ కుమార్, వెంకటేశ్వరరావు ప్రశాంత్ కుమార్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్వ విద్యార్థి సుందర్ బాబు హెచ్పీసీఎల్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి సంతోష్ రావు, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పూర్వ విద్యార్థి కోటేశ్వరరావు, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ పూర్వ విద్యార్థులు విజయ్ కుమార్, జూపూడి ప్రసాద్ అశోక్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ పూర్వ విద్యార్థులు ఎన్ రమేష్ కుమార్, శ్యాంసుందర్, మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్ స్టడీస్ పూర్వ విద్యార్థి జాన్ కిస్టాఫర్ పాల్గొన్నారు మొదటిగా వారు చదువుకున్న ఆర్ట్స్ కాలేజ్ మరియు సైన్స్ కాలేజ్ హాస్టల్స్ నాగార్జున శాతవాహన, సదరన సదన సందర్శించారు వారు చదువుకున్న సమయంలో ఉన్న రూములను వీక్షించి ఆ రాళ్ళను తాకుతూ ఆనందించారు తరువాత బాలయోగి పరిశోధకుల హాస్టల్స్ ను సందర్శించారు వెంటనే వారి వారి డిపార్ట్మెంట్ లకు వెళ్లి వారు చదువుకున్న క్లాస్ రూములను వీక్షించి మనస్ఫూర్తిగా బెంచీలలో కూర్చుని విద్యార్థి రోజులను గుర్తు చేసుకునీ పాఠాలు బోధించిన అప్పటి అధ్యాపకులను గుర్తు చేసుకున్నారు. వీరందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, పీటర్ డెక్కర్ స్మార్ట్ సెమినార్ హాల్లో ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రొఫెసర్ జాలాది రవి అధ్యక్షతన మరియు ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎన్ వి రాజు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ పెట్టేటి ప్రేమానందం
ఆధ్వర్యంలో వీళ్ళందర్నీ ఘనంగా సన్మానించారు ఆ సమయంలో వారి యొక్క పాత జ్ఞాపకాలను అనుభవాలను పంచుకున్నారు, తరువాత ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీసును సందర్శించి డా. బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో అలంకరించి ఏయూ@100 వద్ద ఫోటోలు తీసుకుని ఆనందించారు వాళ్లందరూ మూకుమ్మడిగా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి సాధారణ విద్యార్థి అద్భుతంగా రాణించి వారి వారి కెరియర్లో గొప్ప స్థానాలకు చేరుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ తరతరాలకు విద్యను అందించే జ్ఞాన తల్లిగా వెలుగొందాలని భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఘనత ప్రతి విద్యార్థి చాటి చెప్పాలని మాకు జీవితాన్ని ప్రసాదించి, సమాజంలో ఉన్నతమైన పౌరులుగా అడ్మినిస్ట్రేటర్స్ గా, నాయకులుగా భారతదేశానికి సేవలు అందించటానికి అవకాశం ఇచ్చిన ఆంధ్ర యూనివర్సిటీకి పాదాభివందనాలు తెలియజేస్తూ మేము ఎప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ కి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రొఫెసర్ జాలాది రవి
ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం.


Comments
Post a Comment