విశాఖ
సాగర తీర
తూర్పున
వెలసిన
శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న
బాలాంజ
నేయుడు
సుందర
వదనుడు,
సువిశాల
మనస్కుడు,
పారిజాత
ప్రియుడు,
లేత తమలపాకుల
నేత్రముల
కలబోత
గల వాడు.
వడల, అప్పాల
దండల ధారి.
దారిన పోయే
వారిని తన
దరి చేరి
దర్శించు
కొమ్మనే
ఆకర్షిత
మోము
గల నాధుడు.
అందరికీ తన
హస్తముతో
అభయ మోస
గెడు వాడు.
మరొక
కరములో
గధా ధారి
దుస్టుల యెడల
హెచ్చరిక కు
తార్కణము.
ఆతడి పసిడి
పాదములు
తాకాలని
తలంపు
లేని వాడు
కాన రాడు
అచ్చట.
అయోధ్య లో
బాల రాముడు
కొలువు దీరి
అశేష భక్త
కోటిని
కటాక్షిస్తుంటే
ఇచట. విశాఖ
తూర్పు
తీరాన
శ్రీ ప్రసన్న
బాలాంజ
నేయుడు
తన ప్రసన్న
ముకులిత
వదనం తో
రా, రమ్మంటున్నా డనడం లో
సందేహం
వలదు.
అంతే కాదు
తనకు తోడు
జంట నాగులను,
నవ గ్రహాలను
ప్రతిష్ట కు
పరోక్షంగా
అం్గీకరించి
అనుగ్రహించిన
అభయుడు
మన ఆంజనేయుడు.
తండ్రీ అచ్చట
నిద్ర గన్నేరు
వృక్ష రాజము
కొంచెము
ఆటంకముగా
ఉన్నది అని
వారిని అభ్యర్థించిన
వెను వెంటనే
అభయమొసగిన
ఘనుడవీవు.
అందుకే
నీకు సదా
మ్రక్కెదము
మేమంతా,
మనసారా,
తనివి తీరా,
సదా నీ సేవలో
మేమంతా
తరించెడి
అవకాశం
కలుగ చేసి
నందులకు.
తెలిసి, తెలియక
తప్పులు
చేసి ఉంటే
మమ్ములను
క్షమించి,
నీ అక్కున
చేర్చుకుని
అనుగ్రహించు
ఓ హనుమా!
Dr Nanduri Ramakrishna
Sr Sub EDITOR

Comments
Post a Comment