శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాద్రి అప్పన్న ‘నిత్యాన్నప్రసాద పథకానికి’ లక్ష రూపాయల విరాళం అందజేసిన దాత
. K.V.SHARMA EDITOR
సింహాచలం, తేదీ: 15 జూలై, 2026 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న ‘సింహాద్రి నాథ నిత్య అన్నప్రసాద’ పథకానికి కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన ప్రముఖ దాత విశాఖపట్నం మురళి నగర్ కు చెందిన శ్రీ బోకం శ్రీనివాసరావు గారి అమ్మాయి జ్ఞాన శ్రీ , బుధవారం విరాళాన్ని అందజేశారు.

జ్ఞాన శ్రీ రూ. 1,00,000/- (అక్షరాలా లక్ష రూపాయలు) విలువైన చెక్కును స్వామివారి నిత్య అన్న ప్రసాదం కోసం సమర్పించారు.
ఈ విరాళాన్ని ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి జోగారావుకు దాత స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కూడా పాల్గొన్నారు.
విరాళం అందజేసిన అనంతరం దాతకు ఆలయ అధికారులు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు దాతను సత్కరించి, ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ.. సింహాద్రి అప్పన్నను దర్శించుకునే భక్తుల ఆకలి తీర్చేందుకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి భక్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం . దాతలు ఇచ్చే ప్రతి రూపాయిని భక్తుల అన్నప్రసాద వితరణకే వినియోగిస్తామని వారు తెలిపారు.

Comments
Post a Comment