అనుమతులు అక్కర్లేద్దు.... చెరువు తవ్వుకుంటాం..... యాదేచ్చగా అక్రమ ఆక్వా రంగం సిద్ధం.... కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుకు సిద్ధం...
. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం మొగలమూరు పంచాయతీ పరిధిలోని శిరగట్లపల్లి గ్రామంలో అనుమతులు లేకుండానే చెరువు తవ్వకాలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ప్రజలు నివసిస్తున్న ఇళ్లకు ఆనుకుని చెరువు తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంక్ దగ్గరలో తవ్వకాల జరిపి ఆక్వా సాగు చేస్తే తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు
. కలుషిత నీటిని వినియోగించడం వల్ల గ్రామంలో కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ చెరువు తవ్వకాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, జిల్లా కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి బాధితులు సిద్ధమవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చెరువు తవ్వకాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుని గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Comments
Post a Comment