Skip to main content

ఉన్నత పాఠశాలలకు సౌండ్ సిస్టమ్స్ అందజేత...

.            SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండల పరిధిలో  గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోడిలంక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామంతకుర్రునకు మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ కొమరగిరిపట్నం మరియు రుద్రరాజు సీతాపతిరాజు మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛార్టిబుల్ ట్రస్ట్ గోడిలంక వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇరవై రెండు వేల రూపాయలు విలువగల రెండు సౌండ్ సిస్టమ్ లను అందజేశారు. 


ప్రతీ విద్యార్ధి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ప్రణాళిక బద్ధంగా చదవాలని, ఆరవ తరగతి నుండే మంచి లక్ష్యాలతో చదివితే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్టేట్ లో మంచి ర్యాంకులు సాధించగలరని, తద్వారా ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తును పొందగలరని విద్యార్థులను ఉద్దేశించి ట్రస్ట్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు.పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఆయా గ్రామ పెద్దలు రెండు ట్రస్టుల చేస్తున్న విద్య మరియు వైద్య సేవలను ప్రశంసిస్తూ అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమంలో రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నూర్జహాన్ బేగం, ఎ.శరభరాజు ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటి.వెంకటేశ్వరరావు, రుద్రరాజు రమేష్ రాజు, ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె.రమేష్ బాబు, విద్యా కమిటీ ఛైర్మన్ వాసర్ల లక్ష్మి, వి.శ్రీనివాసరాజు,సుందర్నీడి సాయికృష్ణ,వెల్ఫేర్ మాజీ అధ్యక్షులు బత్తుల నకులరాజు,కడలి త్రిమూర్తులు,ఓలేటి సూర్యప్రకాశరావు, కడలి నాగ గణేష్,యమ్.టి‌.వి సుబ్బారావు, ఆనంద నవీన్, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments