Skip to main content

ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి ఎంపికైన ఇందిరను అభినందించిన ఎం.పీ జి.ఎం. హరీష్ బాలయోగి...

             SRINIVAS SPL Correspondant 


అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం- హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ పొందుతున్న యనమదల ఇందిర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి జూన్ నెలలో జరిగిన సెలక్షన్ ట్రైల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అగ్రస్థానంలో నిలిచి ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి సెలక్షన్ అయినట్లు ఏలూరు స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ గుమమ్ సింగ్ ద్వారా సెలక్షన్ ఉత్వరులను  ఇందిర అందుకున్నట్లు కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఎం.పీ జి.ఎం హరీష్ బాలయోగి  క్యాంప్ ఆఫీస్ వద్ద ఇండియాలో అత్యుత్తమ వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ అకాడమీల్లో ఒకటైన ఏలూరు వెయిట్ లిఫ్టింగ్ అకాడమీకి ఎంపికైన   యనమదల ఇందిర దేశంలోనే అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్ గా తర్ఫీదును పొంది, ఎందరికో ఆదర్శంగా నిలవాలని, జీవితంలో స్థిరపడాలని ఎం.పీ. జి.ఎం హరీష్ బాలయోగి ఆకాంక్షిస్తూ  సన్మానించి,  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వెయిట్ లిఫ్టర్స్ మారే వీరేంద్ర, వై. పల్లం రాజు, జి.దినేష్ ప్రసాద్ పాల్గొన్నారు.

Comments