Skip to main content

కాలుష్యం కోరాల్లోంచి కాపాడే కార్యక్రమమే"వావ్" : నెక్స్ జెన్ పాఠశాల డైరెక్టర్ శశి తాటిపాక నెక్స్జెన్ స్కూల్ విద్యార్థుల వినూత్న ఆలోచన....

.            SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....కాలుష్యం కోరాల్లోంచి మానవాళిని రక్షించే కార్యక్రమమే వావ్ కార్యక్రమేనని నెక్స్ జెన్ పాఠశాల డైరెక్టర్ ఎన్.శశి అన్నారు. స్వచ్ఛభారత్,, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా రాజోలు మండలానికి చెందిన తాటిపాక లో నేడు NEXZEN యాజమాన్యం విద్యార్థులు కలయికతో ప్రభుత్వం తలపెట్టిన వావ్ 


కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ పాత పాఠ్యపుస్తకాలను రీసైకిలింగ్కు పంపి కాలుష్యం నియంత్రించాలని ఆలోచనతో ప్రతి విద్యార్థి తమ కాలం చెల్లిన ( పాతవి) పుస్తకాలు రీసైక్లింగ్ ద్వారా భవిష్యత్తులో వృక్ష సంపద నశించిపోకుండా అరికట్టాలని ఉద్దేశంతో ఈ వావ్ కార్యక్రమం ద్వారా


 విద్యార్థులందరూ తమ పాత పుస్తకాలను రీసైకిలింగ్ విధానానికి తోడ్పడుతున్నారని స్కూలు డైరెక్టర్ ఎన్ .శశి తెలిపారు. యూ.ఎల్.బి   కో ఆర్డినేటర్  ఎన్. విల్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం వావ్ కార్యక్రమం ద్వారా ప్రకృతి రక్షించే వృక్షలను కొంత మేర కాపాడుకోవచ్చని, పాత పుస్తకాలు రీసైక్లింగ్ కొన్ని కోట్ల చెట్లను నరికివేయకుండా చేయవచ్చని అన్నారు. 


నెక్స్ జెన్ పాఠశాలలో నిర్వహించిన  వావ్ కార్యక్రమానికి విద్యార్థుల నుండి  మంచి స్పందన వచ్చిందని పాత పుస్తకాలను అందజేసి పాఠశాల సౌజన్యంతో అందించిన స్టడీ స్టేషనరీ విద్యార్థులు తీసుకున్నారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అందరికీ ప్రాణావాయువు అందించే చెట్ల కాపాడే కార్యక్రమం వావ్ లో మమల్ని భాగస్వామ్యులను చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి. రాణి, సూపర్ వైజర్ ఎమ్. ఫణిశ్రీ, రీజినల్ కోఆర్డినేటర్ ఎన్.రాముడు, వావ్ కోఆర్డినేటర్ ఎన్.కృష్ణకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments