Skip to main content

గాయత్రి విద్యా పరిషత్‌లో జీఎస్‌టీపై రెండురోజుల వర్క్‌షాప్ ప్రారంభం

 


విశాఖపట్నం, జూలై 1: గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ మరియు పీజీ కళాశాల (స్వయంప్రతిపత్తి), ద్వారకానగర్ క్యాంపస్ వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో "నావిగేటింగ్ జీఎస్‌టీ" అంశంపై రెండురోజుల వర్క్‌షాప్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ ప్రశాంత్ కుమార్, గౌరవ అతిథిగా చార్టర్డ్ అకౌంటెంట్ కుమారి కృష్ణ మనోజ్ఞ, ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎంఏ గౌతమ్ హాజరయ్యారు. కళాశాల యాజమాన్య సభ్యులు ఆచార్య పి. రాజగణపతి గాయత్రి విద్యా పరిషత్ సభ్యులు, యూజీ కోర్సుల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్, క్యాంపస్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎ. ఆనంద్, వాణిజ్యశాఖాధిపతి కుమారి కె. సూర్యలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వర్క్‌షాప్ కన్వీనర్ శ్రీమతి ఎస్. కాంచన అతిథులను స్వాగతిస్తూ వర్క్‌షాప్ నిర్వహణ ఆవశ్యకతను వివరించారు. వాణిజ్యశాఖాధిపతి కుమారి కె. సూర్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 1న జీఎస్‌టీ దినోత్సవం జరుపుకుంటామని, జీఎస్‌టీపై సమగ్ర అవగాహన విద్యార్థులకు ఎంతో అవసరమని తెలిపారు.

యూజీ కోర్సుల డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్ జీఎస్‌టీ భావన, మార్గదర్శకాలు, వివిధ రకాల జీఎస్‌టీ విధానాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

యాజమాన్య సభ్యులు ఆచార్య పి. రాజగణపతి పన్నులు పారదర్శకంగా చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, దేశ అభివృద్ధికి అది కీలకమని పేర్కొన్నారు. నిపుణుల అనుభవాలను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

సీఎంఏ గౌతమ్ జీఎస్‌టీ అమలు వల్ల ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా మారడంతో నల్లధన నియంత్రణకు దోహదపడుతుందని వివరించారు. చార్టర్డ్ అకౌంటెంట్ కుమారి కృష్ణ మనోజ్ఞ జీఎస్‌టీ అధ్యయనం ద్వారా అందుబాటులో ఉన్న వివిధ ఉద్యోగ, వృత్తి అవకాశాలను విద్యార్థులకు వివరించారు. ముఖ్య అతిథి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ ప్రశాంత్ కుమార్ జీఎస్‌టీ వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కలిగిన ప్రయోజనాలను విశదీకరించారు.

అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. వర్క్‌షాప్ ముగింపులో కన్వీనర్ శ్రీమతి ఎస్. కాంచన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో బీకామ్ విభాగాధిపతి  సూర్య లక్ష్మిగారు, శ్రీమతి రోజు, విద్యార్థులు పాల్గొన్నారు

Comments