. K.V.SHARMA EDITOR
విభాగ ప్రతికి సమిష్టి కృషి చేయాలని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఆయన ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆధునీకరించిన కార్యాలయ, విభాగాధిపతి చాంబర్‌లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము చదువుకున్న విభాగానికి సహకారం అందించాలనే పూర్వ విద్యార్థుల, ఆచార్యుల ఆలోచనను అభినందించారు. విభాగంలో పూర్వ విద్యార్థుల సహకారంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని వారిని అభినందించారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగం బలమైన పూర్వ విద్యార్థులను కలిగి ఉందన్నారు. వీరిని విభాగంతో, నేటి తరం విద్యార్థులతో అనుసంధానం చేయడం ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు చేస్తున్న దాతృత్వానికి, విభాగం పట్ల వారు చూపుతున్న ప్రేమాభిమానాలను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు విదేశీ విద్యార్థులతో వీసీ రాజశేఖర్ మాట్లాడారు. వారు పరిశోధన చేస్తున్న అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వారి పరిశోధనలను అభినందించారు.
విభాగాధిపతి ఆచార్య జి.ఎం.జె రాజు మాట్లాడుతూ 1933లో పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్టన్ చేతుల మీదుగా ఈ విభాగం ప్రారంభమయిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో నిపుణులను తీర్చిదిద్ది సమాజానికి అందించిందన్నారు. ఆచార్యులు సమర్ధవంతంగా, నిబద్దతతో సేవలు అందించడం జరుగుతోందని వివరించారు. విభాగ ప్రగతిని తెలియజేశారు.
విభాగ కార్యాలయాన్ని తన సొంత నిధులతో ఆధునీకరించిన విభాగ ఆచార్యులు జి.వి.ఎస్ శర్మను సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, పాలక మండలి సభ్యులు ఆచార్య బి.సాంబిరెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎం.శశి, ఆచార్య పద్మశ్రీ, విభాగ ఆచార్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment