టౌన్ కొత్త రోడ్డు, విశాఖపట్నం లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రధయాత్ర మహోత్సవాలలో భాగంగా బలబద్ర ,సుభద్రా దేవి సమేత శ్రీ జగన్నాథ స్వామి వారు దశమి శుక్రవారం నాడు శ్రీ కృష్ణ అవతారం లో భక్తులకు దర్శనమిచ్చారు. దశమి పర్వదినం కావడంతో భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లలో బారులు తీరారు.
మధ్యాహ్నం 1200 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఫెస్టివల్ ఆఫీసర్ టి అన్నపూర్ణ పర్యవేక్షణలో ఆలయ ఈఓ టి రాజ గోపాల్ రెడ్డి మరియు ధర్మ కర్తల మండలి చైర్మన్ ఎస్ రాజ్ కుమార్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.


Comments
Post a Comment