ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 23: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల సహకారంతో నిర్వహించనున్న మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) పోస్టర్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ నేడు ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు.
రూసా–2.0 కార్యక్రమాల సందర్భంగా "కృత్రిమ మేధస్సుతో అధ్యాపకులు, పరిశోధకులను సాధికారత వైపు నడిపించడం – ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అనే అంశంపై ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ఆగస్టు నెల 5 వ తేదీ నుండి 7 వ తేదీ, వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల ప్రాంగణంలో జరగనుంది. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు మరియు పరిశోధకులకు కృత్రిమ మేధస్సు వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, సి.డి.సి డీన్ ఆచార్య టి.వి. కృష్ణ, సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా. శైజి పి.డి., వైస్ ప్రిన్సిపాల్ డా.ఎస్. హేమ, సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి కె. నాగ సిరీష, డా. పి.అరుణ దేవి, డా. సుజాత తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment