. K.V.SHARMA EDITOR
విశాఖ సందేశం:16,జూలై:విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్డు నుంచి పూర్ణా మార్కెట్ వరకు గురువారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది.విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు.
సాంస్కృతిక , సాంప్రదాయ భజన బృందాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శోభాయమానంగా సాగిన యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు హాజరై జై జగన్నాథ్ నినాదాలతో హోరెత్తించారు.ఆద్యంతం ఆధ్యాత్మికవెల్లివిరిసిన ఈ యాత్రలో మునుపెన్నడూ లేని రీతిలో భక్తులు హాజరయ్యారు.
టౌన్ కొత్త రోడ్డు నుంచి పూర్ణా మార్కెట్ వరకు సాగిన రథయాత్రలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భక్తులతో కలిసి కాలినడకన పాల్గొన్నారు. మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలు, భజన బృందాల ప్రదర్శనలతో రథయాత్ర శోభాయమానంగా కొనసాగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా వేలాదిమంది భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి రథయాత్రను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్నాథ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో,
ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో ఐక్యతను, సనాతన సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలోఆలయ ఈవో టీ రాజగోపాల్ రెడ్డి,ధర్మకర్తలు మండలి చైర్మన్ సూరాడ రాజ్ కుమార్,ధర్మకర్తల మండలి సభ్యులు, కూటమి సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ శాఖల ప్రముఖులు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comments
Post a Comment