Skip to main content

స్నేహ సంధ్య వారి ఆధ్వర్యంలో గో సేవ, నారాయణ సేవ ......

 


స్నేహ సంధ్యా సంస్థ సభ్యులు వివేకానంద సంస్థ నందు ఉన్న గోమాతలకు గో సేవ నిర్వహించి, వివేకానంద సంస్థ ద్వారా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమాలకు నారాయణ సేవలో భాగంగా, నిత్యవసర వస్తువులను అందించారు. 


కాసేపు వివేకానంద ఆశ్రమ వాసులతో వారి యోగక్షేమాలను కనుక్కొని, కథలు, కబుర్లు చెబుతూ సరదాగా కాలక్షేపం చేశారు. ఈ సందర్భంగా స్నేహ సంధ్యా సంస్థ సభ్యులు ఆదిభట్ల ఆచారి గారి దంపతులు మాట్లాడుతూ, వివేకానంద సంస్థ ఆశ్రమం వారు నిత్య అన్నదానాలు, వృద్ధుల సంరక్షణ బాధ్యతలు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారని, 


వారి సేవలలో మేము భాగం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భావిస్తున్నామని, ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు గారిని కొనియాడారు.  ఈ సేవా కార్యక్రమంలో ఆదిభట్ల ఆచార్య గారి దంపతులు ప్రముఖ సంఘ సేవకులుP. సత్యమంతరావు, రమేష్ గారు మరియు స్నేహ సంధ్యా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

.

Comments