స్పిరిట్ ఆఫ్ యూనిటీ-శ్రీ సత్య సాయి రన్ & రైడ్ 'కి పుట్టపర్తి వేదిక – శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ పోస్టర్ విడుదల చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్ జే రత్నాకర్*
నెల 26వ తేదీన పుట్టపర్తిలో హిల్ వ్యూ స్టేడియం లో జరగనున్న *శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్ – స్పిరిట్ ఆఫ్ యూనిటీ" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్ జే రత్నాకర్ గారు ఆవిష్కరించారు.*
ఈ సందర్భంగా **శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ సేవా విభాగం (పురుషుల)కోఆర్డినేటర్ * శ్రీ ఎస్ కోటేశ్వర రావు గారు **శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ R. లక్ష్మణ రావు గారు *, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మూర్తి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ (పురుషుల )సమన్వయకర్త శ్రీ సి.గౌతమ్ గారు, శ్రీ సత్య సాయి జిల్లా సేవా విభాగం సమన్వయకర్త శ్రీ సీతారాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారు మాట్లాడుతూ, 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఉచిత కార్యక్రమానికి ముందుగానే నమోదు చేసుకుని, అత్యంత ఉత్సాహంతో పాల్గొని, భగవాన్ శ్రీ సత్యసాయి బోధించిన మానవతా సందేశాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.
పుట్టపర్తి పిలుస్తోంది… మనమందరం పాల్గొని ఈ మహత్తర సేవా యజ్ఞాన్ని విజయవంతం చేద్దాం.

Comments
Post a Comment