Skip to main content

జిల్లా పార్టీ కార్యాలయం లో ముద్రగడ పద్మనాభం గారికి ఘన నివాళులు*

.                  K.V.SHARMA EDITOR 
ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ ప్రజానేత   ముద్రగడ  పద్మనాభం కి ఘనంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి కార్యక్రమం అనంతరం 02 నిమిషాలు మౌనం పాటించారు .  నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం  మరణం రాష్ట్ర రాజకీయాలకు, సమాజానికి, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.ఆయన మాట్లాడుతూ, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ముద్రగడ పద్మనాభం  జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు అన్యాయం చేసినప్పుడు వాటిని ప్రశ్నిస్తూ, ఎత్తిపోతల పథకాలు, భూసేకరణ, రైతుల సమస్యలు వంటి అనేక ప్రజా సమస్యలపై ఆయన నిరంతరం ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా కాపు ఉద్యమ నాయకుడిగా ఆ సామాజిక వర్గానికి రాజకీయ, సామాజిక న్యాయం సాధించేందుకు చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలనుకునే వారికి ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ముద్రగడ పద్మనాభం  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారని తెలిపారు. వ్యక్తిగత ఆస్తులు, వందల ఎకరాల భూములను కూడా ప్రజా ఉద్యమాల కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అలాగే, ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా ఆదరించి, భోజనం పెట్టి పంపించే గొప్ప మనసున్న నాయకుడని కేకే రాజు గుర్తచేశారు. అలాంటి పోరాట యోధుడు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేకే రాజు, ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా కుమారుడు గిరీష్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి పార్టీ , సీనియర్ నాయుకులు తాడి జగన్నాధ్ రెడ్డి , జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, జివి రవి రాజు,  శ్రీదేవి వర్మ , సనపల రవింద్ర భరత్, కర్రి రామి రెడ్డి , బొండ ఉమామహేశ్వరరావు , పిలా ప్రేమ్ కిరణ్ , బోని శివ రామ కృష్ణ , రెయ్యి వెంకటరమణ , ఆల్ఫ్ కృష్ణ , సుమన్ యాదవ్ ,  బిపిఎన్ కుమార్ జైన్ ,  దేముడు మాస్టర్ , పులగం శ్రీనివాస్ రెడ్డి , దల్లి రామ కృష్ణ రెడ్డి , బంగారు భవాని , సురేష్ ,చంద్ర శేఖర్ , లక్ష్మణ్ , పార్వతి , దమయంతి , పేర్ల రాము తదితరులు పాల్గొన్నారు.

Comments