మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎంపీ చింతా అనురాధకూటమి పాలనలో మహిళలకు భద్రత లేదు....
SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లిలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీ చింతా అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించిన నాయకులు, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.
మహిళల జోలికి వస్తే అదే వారి ఆఖరి రోజు అని గతంలో హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాట తీస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని వైస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు సంసాని బులి నాని ప్రశ్నించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లిబోయిన శ్రీను, , రాజోలు ఇంచార్జి పాముల రాజేశ్వరి, రెడ్డి నాగేంద్ర మణి, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి, మండపేట పరిశీలకులు ఒంటెద్దు వెంకన్న నాయుడు, సత్యం కాపు సుదా గణపతి వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు కొనుకు గౌతమి రాకాపు విజయలక్ష్మి, బర్రె సితారత్నం పాల్గొన్నారు.



Comments
Post a Comment