. K.V.SHARMA EDITOR
ఇసుక కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి వేడుక 29-07-2026 బుధవారం నాడు వైభవంగా జరిగాయి. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ అర్చకులు ఫణిహారం నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు , కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4:00 గంటల నుండి వేలాది సంఖ్యలో భక్తుల తరలివచ్చి నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ద్వారా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి అనంతరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 148 దంపతలు స్వామి వారి వ్రతం చేయించుకున్నారు. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు . ధర్మ కర్తల మండలి చైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో 1000 భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
స్వామి వారిని హోమ్ శాఖా మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు దర్శించుకున్నారు. వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు వేదాశీర్వచనం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ టి రాజ గోపాల్ రెడ్డి, చైర్మన్ కె సూర్య ప్రసాద్ ఆధ్వర్యంలో పౌర్ణమి ఏర్పాట్లు పర్యవేక్షించారు

Comments
Post a Comment