Skip to main content

చేతివృత్తులను ఆదరించండి* *హస్త కళలను ప్రోత్సహించండి* *ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపూడి*..

.                     K.V.SHARMA EDITOR 
 పెదవాల్తేరు.. విశాఖపట్నం జూలై 13 దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన  చేతి వృత్తులను ఆదరించాలని.. హస్త కళలను ప్రోత్సహించాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే *వెలగపూడి రామకృష్ణబాబు* పిలుపునిచ్చారు.. సోమవారం ఇక్కడ కరక చెట్టు పోలమాంబ ఆలయం వద్ద ఆలిండియా క్రాఫ్ట్ బజార్ ను  ముఖ్యఅతిథిగా హాజరై వెలగపూడి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రాష్ట్రాలకు చెందిన చేతివృత్తులు.. హస్తకళలు. చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకే విక్రయిస్తుండడంతో వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.. వినియోగదారులు అందిస్తున్న అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 


ఆయన కోరారు.. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోనీ వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకే చోటకు తీసుకువచ్చి ప్రదర్శించడం.. విక్రయించడం వల్ల అన్ని వస్తువులను ఒకే చోట సందర్శించి తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు *గంట్ల శ్రీనుబాబు* మాట్లాడుతూ 

తక్కువ ధరకు లభ్యమయ్యే ఈ బజార్ ను ప్రజలు ఉచితంగానే తిలకించవచ్చునన్నారు.. అలాగే నాణ్యమైన చీరలు..

 గృహోపకరణాలకు అవసరమయ్యే సామగ్రి  అంతా ఇక్కడ అందుబాటులో ఉందన్నారు.. కావున ఆయా ప్రాంతాల ప్రజలు ఆలిండియా క్రాఫ్ట్ బజార్ ను సందర్శించాలని గంట్ల శ్రీను బాబు కోరారు..


ఎగ్జిబిషన్ నిర్వాహకులు.. విశాఖ ఆర్టీసియన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు *మొహమ్మద్ నసీం*మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుంచి ముత్యాలు.. కలంకారి పెయింట్స్.. రాజస్థాన్ బెడ్ షీట్స్.. బెంగాల్ కాటన్ సారీస్.. కాటన్ డ్రెస్ మెటీరియల్.. మైసూర్ రోజ్ వుడ్.. తో పాటు అనేక రకాల వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు

ఈ ప్రదర్శన ఉదయం 10 నుంచి 


రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు.. తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమం లో పోలమాంబ ఆలయ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మద్ది శ్రీనివాస్ రెడ్డి . తెలుగుదేశం పార్టీ మైనారిటీ విశాఖ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రహీమతుల్లా తదితరులు పాల్గొన్నారు.. వీరంతా తొలుత క్రాఫ్ట్ బజార్ ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు.. అతిధులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు

Comments