Skip to main content

నగరంలో మరో వస్త్ర నందనం వకుళ సిల్క్స్ ప్రారంభం


జగదాంబ జంక్షన్/విశాఖపట్నం 4 జూలై 2026
: విశాఖ నగరంలోని అత్యంత రద్దీ వాణిజ్య కూడలి జగదాంబ జంక్షన్ ఏరియాలో మరో అద్భుతమైన వస్త్రాల షోరూం వకుళ సిల్క్స్ నేడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో గౌరవ అతిధులు గా పాల్గొన్న  పేరొందిన రాజకీయ నాయకులూ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ మరియు మరో ప్రముఖ వ్యక్తి మాధురి గారు వకుళ సిల్క్స్ ను లాంచనంగా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో భారీ షోరూం ఆవిష్కరణ వేడుక ఒక గొప్ప పండుగ వాతావరణంను తలపించింది. షోరూమ్‌ను రంగురంగుల పూల అలంకరణలు, సాంప్రదాయ అలంకరణలు, రంగురంగుల దీపాలంకరణలుతో  ప్రారంభోత్సవం ఒక చిరస్మరణీయ దృశ్యంగా నిలిచేలాగా అద్భతంగా రూపొందించారు. రిబ్బన్ కటింగ్ అనంతరం, వ్యాపారానికి శ్రేయస్సు, విజయం కలగాలని ఆకాంక్షిస్తూ సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసారు.

       ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనూజ పుట్టస్వామి, బిగ్ బాస్ రన్నరప్  ఫేమ్ ముఖ్య అతిధిగా హాజరు కావటంతో మరింత ఉత్సాహం నెలకొని వందలాది మంది ఉత్సాహభరితమైన అభిమానులు గుమిగూడి, బిగ్గరగా కేకలు వేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ, చప్పట్లతో ఆమెకు స్వాగతం పలకడంతో అక్కడ అత్యంత సందడి వాతావరణం నెలకొంది. అనేకమంది కొనుగోలుదారులు, ఫ్యాషన్ ప్రియులు, కుటుంబాలు, శ్రేయోభిలాషులు షోరూమ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

            వకుళ సిల్క్స్ ప్రారంభోత్సవం  సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖపట్నానికి ప్రపంచ స్థాయి వస్త్ర అనుభవాన్ని నగరానికి తెచ్చిన వకుళ సిల్క్స్‌ను అభినందించి, యాజమాన్యానికి అపారమైన విజయం చేకూరాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు అసాధారణమైన విలువను అందిస్తూ, సాంప్రదాయ భారతీయ హస్తకళకు అంకితమైన ఒక సుందరమైన కేంద్రాన్ని స్థాపించినందుకు వకుళ సిల్క్స్ బృందాన్ని మాధురి అభినందించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న  బిగ్ బాస్ రన్నరప్ తనుజ పుట్టస్వామి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక వకుళ సిల్క్స్  ప్రారంభోత్సవంలో పాల్గొన్నందు  ఆనందాన్ని వ్యక్తం పరుస్తూ, షోరూమ్  వైభవాన్ని ప్రశంసించారు. ఆమె అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ, షోరూం లోని సిల్క్ కలెక్షన్లలోని గొప్ప వైవిధ్యాన్ని అభినందించారు. వకుళ సిల్క్స్ ఒక ఇష్టమైన షాపింగ్ గమ్యస్థానంగా మారాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.


                  భారతదేశంలోని ప్రఖ్యాత నేత కేంద్రాల నుండి సేకరించిన ప్రీమియం సిల్క్ మరియు డిజైనర్ చీరలు కాంచీపురం, బనారసి, ఉప్పాడ,  గద్వాల్ , ధర్మవరం, పోచంపల్లి , పైఠానీ , మైసూరు,  టస్సర్, చందేరి, మహేశ్వరి వంటి  పట్టు చీరలు, సాఫ్ట్ సిల్క్ చీరలు, సెమీ సిల్క్ చీరలు, టిష్యూ సిల్క్ చీరలు, కోటా పట్టు చీరలు, చేనేత పట్టు చీరలు, పెళ్లికూతురు పట్టు చీరల కలెక్షన్స్, డిజైనర్ పార్టీ వేర్ చీరలు, ఫ్యాన్సీ చీరలు ఎన్నెన్నో ఈ షోరూం నందు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, విస్తృత శ్రేణి పట్టు వస్త్రాలపై 20% నుండి 60% వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. వినియోగదారులు ఈ పరిమిత-కాల ప్రారంభోత్సవ ఆఫర్లు  సద్వినియోగం చేసుకోవలసినదిగా షోరూం నిర్వాహకులు కోరుచున్నారు. సమగ్రమైన పట్టు చీరల గమ్యస్థానం అందుబాటులోకి రావటంతో చాలా మంది కొనుగోలుదారులు ఆనందం వ్యక్తపరిచారు. రాబోయే కాలంలో నిరంతర పండుగ ఆఫర్‌లు, ప్రత్యేకమైన బ్రైడల్ కలెక్షన్‌లు మరియు అద్భుతమైన ఖాతాదారుల  సేవను అందిస్తామని వకుళ సిల్క్స్ యాజమాన్యం హామీ ఇచ్చారు.

                              కె.వి. శర్మ 

                           సంపాదకుడు


Comments