. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ పరిధిలోని తోట్ల పాలెంకు చెందిన దూనబోయిన వెంకట కృష్ణ (నాగబాబు) అతి చిన్న వయస్సులో మృతి చెందిన సంఘటన ఈ ఏడాది జూన్ 25న చోటుచేసు కుంది.ఇతనికి భార్య ఏడాది వయసుగల ఆడబిడ్డ ఉందన్న విషయం తెలుసుకున్న శెట్టిబలిజ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ సోమవారం మృతుని నివాసానికి స్వయంగా హాజరై పరామర్శించి సంతాపం తెలియజేశారు.ఆ కుటుంబానికి ఆయన తన వంతు సాయంగా 50వేల నగదును అందజేశారు.
అలాగే త్వరలో చిన్నారికి లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ లక్ష రూపాయలు అందజేస్తున్నట్లు ఎస్.ఎ.ఎఫ్ నాయకులు చొల్లంగి వెంకట రమణ తెలిపారు.మృతుని స్నేహితులు గ్రామస్తులు సేకరించిన నాలుగు లక్షల పైబడి నగదు ను త్వరలో అందజేస్తున్నట్లు వెంకటరమణ తెలిపారు.వీటితో పాటు కౌరు ఫౌండేషన్ వ్యవస్థా పకులు కౌరు నరసింహస్వామి 10 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు శత్రుష్, దొంగ ఆంజనేయులు, గుత్తుల రాజు,బొంతు సత్తిబాబు,మట్టపర్తి రమేష్, తోట్లపాలెం శెట్టిబలిజ యువత పాల్గొన్నారు.

Comments
Post a Comment