. K.V.SHARMA EDITOR
ఆంధ్ర విశ్వవిద్యాలయం, జూలై 21:ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పీ. రాజశేఖర్ నేడు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సోషల్ సైన్సెస్ భవనంలో ఉన్న సోషల్ వర్క్, సోషియాలజీ, జాగ్రఫీ తదితర విభాగాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
అనంతరం విభాగాధిపతులు, అధ్యాపకులతో మాట్లాడిన ఉపకులపతి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు బోధనలో మరింత నిబద్ధత, సమయపాలనతో వ్యవహరించాలని పేర్కొన్నారు. విభాగాల పరిసరాలను ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, విద్యార్థులు ఆహ్లాదకరమైన, సానుకూల విద్యా వాతావరణంలో అబ్యాసన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో బోధన విధానం, తరగతుల నిర్వహణ, విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యా వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే అధ్యాపకులు, సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేసి, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సూచించారు.
అనంతరం విభాగాధిపతులు, అధ్యాపకులతో మాట్లాడిన ఉపకులపతి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు బోధనలో మరింత నిబద్ధత, సమయపాలనతో వ్యవహరించాలని పేర్కొన్నారు. విభాగాల పరిసరాలను ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, విద్యార్థులు ఆహ్లాదకరమైన, సానుకూల విద్యా వాతావరణంలో అబ్యాసన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థి కేంద్రిత విద్యా విధానానికి ప్రాధాన్యం ఇస్తూ, బోధన నాణ్యతను మరింత మెరుగుపరచడం విశ్వవిద్యాలయం లక్ష్యమని ఉపకులపతి ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment