అక్రమ మట్టి, ఇసుక, బొండు ఇసుక తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలి. బెల్లంపూడి మాజీ సర్పంచ్ బండి మహాలక్ష్మి కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారికి పిర్యాదు
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, లంకల గన్నవరం మరియు ఊడిమూడిలంకలో రాజకీయ నాయకుల అండదండలలో అక్రమ మైనింగ్ మాఫియా పేట్రేగిపోయి ,రాత్రి సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా సి .ఆర్. జెడ్ ప్రాంతాల నుండి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, బొండు ఇసుక మరియు బొండు ఇసుకను అక్రమంగా తరలించుకుని పోయారని,దీని కారణంగా రైతుల పంట పొలాలు సర్వ నాశనం అయ్యాయని,పర్యావరణం ధ్వంసం అయ్యిందని, యర్రంశెట్టివారిపాలెం నుండి గంటి పెదపూడి వరకూ ఉన్న గోదావరి రక్షణ గట్టు ( ఏటిగట్టు ) పూర్తిగా ధ్వంసం అయ్యిందని, యర్రంశెట్టి వారిపాలెం, గంటి పెదపూడి వద్ద కాలువపై ఉన్న వంతెనలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ,రెవెన్యూ శాఖ అధికారులు,మైనింగ్ శాఖ అధికారులు అక్రమ మైనింగ్ మాఫియా వైపు చూసి చూడనట్లు వ్యవహరించి,వారికి వత్తాసు పలుకుతున్నారని,
అక్రమ మైనింగ్ మాఫియా చేస్తున్న వారిపైన, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని బెల్లంపూడి గ్రామ మాజీ సర్పంచ్ బండి మహాలక్ష్మి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బండి మహాలక్ష్మి మాట్లాడుతూ, పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, లంకల గన్నవరం మరియు ఊడిమూడిలంకలో కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, బొండు ఇసుక, లంక మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా,అక్రమంగా , సి ఆర్. జెడ్ ( CRZ) ప్రాంతం నుండి సుమారుగా 20 అడుగుల లోతు వరకు, నది గర్భాన్ని తొలిచివేసి, పర్యావరణ విధ్వంసం చేసి, వేలాది టిప్పర్ లలో తరలించుకుని పోయారని,వేలాది పచ్చని కొబ్బరి చెట్లు తొలగించి ,కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల లంక మట్టిని కూడా తరలించుకుని పోయారని, రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు గత నాలుగు నెలలుగా ఏమాత్రం పట్టించుకోలేదని, దీని కారణంగా తీవ్ర నష్టం జరిగిందని, ఈ ప్రాంతాలలో అక్రమ మట్టి, ఇసుక, బొండు ఇసుక త్రవ్వకాలు,తరలింపు పై పూర్తి గా దర్యాప్తు చేసి,సర్వే నిర్వహించి, అక్రమ మైనింగ్ కు పాల్పడిన వ్యక్తులపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని,అలాగే
అక్రమ మట్టి, ఇసుక, బొండు ఇసుక మాఫియాను అడ్డుకోకుండా చోద్యం చూసిన రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సమగ్రంగా లెటర్ లెటర్ ద్వారా రెవెన్యూ డివిజనల్ అధికారిగారికి వివరించడం జరిగిందని తెలిపారు.చర్యలు తీసుకోకపోతే అన్ని ఆధారాలతో రైతులు,స్థానిక ప్రజలతో కలిసి హై కోర్టులో, లోకాయుక్త లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని ఆర్.డి. వో కి తెలియచేసినట్లు మాజీ సర్పంచ్ బండి మహాలక్ష్మి తెలియచేసినట్లు తెలిపారు. బండి మహాలక్ష్మి తో పాటు ఆమె కుమారుడు బండి రమేష్ కూడా ఆర్. డి. వో ని కలిసి, అక్రమ మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments
Post a Comment