Skip to main content

నిమ‌యావ‌ళిపై పూర్తి అవ‌గాహ‌న‌ ఉండాలి

 

                    K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం: జూలై 7 విభాగాల‌లో విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా తీసుకునే నిర్ణ‌యాల‌కు సంబంబ‌ధించిన నియ‌మావ‌ళిపై ప్ర‌తీ ఉద్యోగికి సంపూర్ణ అవ‌గాహ‌న ఉండాల‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అన్నారు. మంగళవారం  సాయంత్రం ఏయూ ఎగ్జామినేషన్స్ ,ఎస్-1 ,కంప్యూటర్ సెంటర్ మరియు కాలేజీ డవలప్మెంట్ కౌన్సిల్  విభాగాల‌కు చెందిన సిబ్బందితో  నిర్వ‌హించిన వ‌ర్క్‌షాప్‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. 


ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌తీ విభాగానికి సంబంధించిన నియ‌మావ‌ళిని సిద్దం చేసుకోవాల‌న్నారు. దీనిని అనుస‌రిస్తూ ఫైల్ నిర్వ‌హణ జ‌ర‌గాల‌న్నారు. త‌ద్వారా ఫైల్‌పై నిర్ణ‌యం తీసుకోవ‌డం, అమ‌లు చేయ‌డం, అనుమ‌తులు పొంద‌డం ఎంతో సర‌ళంగా మారుతుంద‌న్నారు. ఒక నిర్ధిష్ట అంశంపై ఫైలు పెట్టే స‌మ‌యంలో దానికి అనుమ‌తి ఇవ్వ‌డానికి, తిర‌స్క‌రించడానికి సంబంధించిన నియ‌మావ‌ళిని ఖ‌చ్చితంగా తెలుసుకోవ‌డం, దానిలో పొందుప‌ర‌చ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. ఒక విభాగంతో మ‌రొక విభాగం అనుసంధానంగా ప‌నిచేయాల‌ని సూచించారు.


అనంత‌రం విభాగాల వారీగా వారి విధులు, విభాగాల‌లో ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌లు, స‌వాళ్ల‌ను సూప‌రిండెంట‌ర్లు ఇత‌ర విభాగాల సిబ్బందికి, అధికారుల‌కు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments