Skip to main content

సమాజ భాగస్వామ్యం మరియు సామాజిక బాధ్యత – హోమ్ సైన్స్ నిపుణుల పాత్ర


 సెయింట్ జోసెఫ్స్ కళాశాల హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో “సమాజ భాగస్వామ్యం మరియు సామాజిక బాధ్యత – హోమ్ సైన్స్ నిపుణుల పాత్ర” అనే అంశంపై జూలై 31, 2026న అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమరకంటక్‌లో గల ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ హోమ్ సైన్స్ విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. వెంకటేశన్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు.


డాక్టర్ కె. వెంకటేశన్ తన ప్రసంగంలో విస్తరణ విద్య (ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్), సమాజ భాగస్వామ్యం, సామాజిక బాధ్యత వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. హోమ్ సైన్స్ నిపుణులు వ్యక్తులు, కుటుంబాలు, సమాజ జీవన ప్రమాణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సేవాభావాన్ని పెంపొందించుకోవాలని, తమ విద్యను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని సూచించారు.


అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమం ముగింపులో కళాశాల తరఫున డాక్టర్ కె. వెంకటేశన్‌ను ఘనంగా సత్కరించారు.


ఈ అతిథి ఉపన్యాసం విద్యార్థులకు విజ్ఞానవంతమైనదిగా, ప్రేరణాత్మకమైనదిగా నిలిచింది. హోమ్ సైన్స్ విద్య ద్వారా సమాజానికి అర్థవంతమైన సేవలను అందించాలనే స్పూర్తిని విద్యార్థుల్లో నింపింది. అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

కార్యక్రమంలో హోమ్ సైన్స్ విభాగ అధ్యాపకులు శ్రీమతి వాడ్రేవు సోనీ, డాక్టర్ టి. గాయత్రి, సిస్టర్ దీపాలి, నివ్య, శ్రీజానంద పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...