శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. * గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఆకర్షణగా “శ్రీహరి నమామి గిరి పౌర్ణమి” గేయం.
సింహాచలం, జూలై 23: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన “శ్రీహరి నమామి గిరి పౌర్ణమి” గేయానికి సంబంధించిన సీడీని గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ముట్టింబాక అభిషిక్త్ కిషోర్ (IAS). ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్.విశాఖపట్నం (GVMC) మున్సిపల్ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ (IAS).ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు, పాల్గొని గేయ సీడీని విడుదల చేశారు. భక్తి, ఆధ్యాత్మికత, సింహాచల క్షేత్ర మహిమను ప్రతిబింబించేలా ఈ గేయాన్ని రూపొందించారు.
గేయ రచన, స్వరకల్పన, నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన శ్రీమతి జయప్రభాశర్మను, గానం చేసిన సత్యశ్రీ, రితికలను జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ సాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరి ప్రదక్షిణలో పాల్గొనే లక్షలాది మంది భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంపొందించేలా రూపొందించిన ఈ గేయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. శ్రీ స్వామివారి కృపతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు ,అధికారులు, పోలీస్ శాఖ, జీవీఎంసీ అధికారులు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment