Skip to main content

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన దురదృష్టకర ఘటనపై భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని, ఆందోళనలో ఉన్న గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

.                    K.V.SHARMA EDITOR 
​ఈ ఘటన జరిగిన రాత్రి నుంచే మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, నేవీ అధికారులు, మరియు జిల్లా కలెక్టర్‌ గారితో ఆయన నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరశురామరాజు గారు మాట్లాడుతూ... బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ సౌత్ ఇంచార్జ్ & స్టేట్ బిల్డింగ్ కమిటీ సభ్యులు బొత్స సురేష్ కుమార్, ఈస్ట్ ఇంచార్జ్ రవిరాజ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్రావు, బీజేపీ మండల అధ్యక్షులు వాసుపల్లి రామారావులతో పాటు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు  పాల్గొన్నారు.

Comments