Skip to main content

టీటీడీ చరిత్ర లో మొదటి సారి పేద మరియు సాధారణ భక్తురాలికి దక్కిన అరుదైన గౌరవం......చెన్నైకి చెందిన శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ జన్మ ధన్యమైంది

                   K.V.SHARMA EDITOR 


టీటీడీ చరిత్ర లో మొదటి సారి పేద మరియు సాధారణ భక్తురాలికి దక్కిన అరుదైన గౌరవం......చెన్నైకి చెందిన శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ జన్మ ధన్యమైంది. 116 ఏళ్ల వయసున్న సునీతమ్మ అలిపిరి మెట్ల మీద ఎక్కి స్వామివారి సన్నిధికి రావడం అనేది చరిత్రలో మొదటిసారి....ఇంతటి వృద్ధురాలు అలిపిరి మెట్లు ఎక్కి స్వామి కోసం వచ్చిందని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని ఆమెను విఐపి గానే పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు..... దీంతో టిటిడి ఆమెకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించింది...ఆమెను బస చేసిన గది నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు... టీటీడీ సిబ్బంది 5 ఆమెను దగ్గరుండి ఆలయంలోకి ఉద్యోగుల ప్రవేశద్వారం నుంచి తీసుకెళ్లారు...స్వామి సేవకు ఆమెను ఒక్కదానిని తీసుకెళ్లి స్వామి సేవలో పాల్గొనేట్టు చేసి ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేసి,, ప్రసాదం అందించి,, సత్కరించి పంపించారు...తన జన్మ ధన్యమైందని సునీతమ్మ చెప్పింది...

Comments